రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టండి: MLA Peddi Sudarshan Reddy

by Kalyani |   ( Updated:2023-02-08 15:18:29.0  )
రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టండి: MLA Peddi Sudarshan Reddy
X

దిశ, నర్సంపేట: ప్రగతి భవన్ ని పేల్చాలాన్నా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రగతి భవన్ ను పేల్చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో సీనియర్లు అయిన సీఎల్పీ నేత భట్టి, జానారెడ్డి లు సమర్థిస్తారా.. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన పెద్ది, రేవంత్ రెడ్డి పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలన్నారు. అనుచితంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ మార్చుకుందా.. అని ప్రశ్నించారు.

తెలంగాణ పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ ప్రభుత్వ ఆఫీస్ లను పేల్చాలని డిమాండ్ చేస్తారా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న పీసీసీ లు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆలోచించాలన్నారు. నక్సలైట్లను నిషేధించిన పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం, ఒక పీసీసీ హోదాలో ఈ తరహా వ్యాఖ్యలు సరికాదన్నారు.


Next Story

Most Viewed