Purandeshwari: ఆ అర్థమేంటో రేవంత్ రెడ్డి చెప్పాలి.. పురందేశ్వరి విమర్శలు

by Prasad Jukanti |
Purandeshwari:  ఆ అర్థమేంటో  రేవంత్ రెడ్డి చెప్పాలి.. పురందేశ్వరి విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (Purandeshwari) విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని కులంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు సరికాదని, మోడీ లీగలీ కన్వర్టెట్ అంటే అర్థమేంటో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలను అవమానపరిచేలా రేవంత్ మాట్లాడారన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు సమాన వాటా దక్కిందన్నారు. కృష్ణానీటి వివాదం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చూసుకుంటాయని వివాదాల పరిష్కారానికి కృష్ణా ట్రైబ్యునల్ ఉందన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయడంలేదన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, వృద్ధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపించారు.



Next Story