- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చనిపోయేంతలా కొట్టాలని ఏ చట్టం చెప్పింది..? ప్రొ. కోదండరాం ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుందా? లేక ప్రజాస్వామ్యం నడుస్తుందా? అనే అనుమానం కలుగుతుందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుందా? లేక ప్రజాస్వామ్యం నడుస్తుందా? అనే అనుమానం కలుగుతుందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
దొంగతనం చేశాడనే అనుమానంతో కూలీ పని చేసుకొని జీవనం గడిపే ఖదీర్ ఖాన్‌ను పోలీసులు అనాగరికమైన పద్దతులతో విచారించడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. ఐదు రోజులు చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అతను గత పది రోజుల నుంచి పలు దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించడం యావత్తు తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని తెలిపారు. పోలీసుల విచారణ తీరును ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులు ఒక వ్యక్తిని చనిపోయేంతలా కొట్టాలని ఏ చట్టం చెబుతుంది ? ఇది లాకప్ డెత్ కాదా? ఇప్పుడు ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. అతని భార్య, ముగ్గురు పిల్లలకు దిక్కెవరు ? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసును లాకప్‌డెత్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.
ఖదీర్ ఖాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేయాలని, వీరిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, విచారణను తప్పుదోవ పట్టిస్తున్న మెదక్ డీఏస్పీని వెంటనే బదిలీ చేసి, సక్రమంగా విచారణ జరిగేలా ప్రభుత్వం చూడాలని కోదండరాం డిమాండ్ చేశారు.