హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము

by Mahesh |   ( Updated:2023-12-19 11:33:39.0  )
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము
X

దిశ, డైనమిక్ బ్యూరో: భాగ్యనగరంలో హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ శతాబ్ది వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం ఆమె నిన్న రాత్రి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరంలోని బొల్లారంలోనే బస చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సమయంలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్​లో వంద ఏళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు.

రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి తిరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. రేపు ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed