- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ సమస్యపై మరో ఉద్యమానికి సిద్ధం : పిడమర్తి రవి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై మరో ఉద్యమానికి యువత తక్షణమే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు చేపట్టిన నిరుద్యోగ బస్సు యాత్రను ఓయూ కాలేజీ వేదికగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని అందుకు అనుగుణంగా వచ్చిన తెలంగాణలో నిరుద్యోగులకు భరోసాగా నిలబడతానని అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి నేనెప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రధాన ఎజెండా నియామకాలు అని దానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. నిరుద్యోగులు ఎవరూ దిగులు పడవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉపాధ్యాయ, పోలీస్, యూనివర్సిటీల ప్రొఫెసర్ల నియామకం గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 4 ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిష్పత్తి పక్షంగా నియామకాలు జరగాలని, ఇప్పుడు ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ను చట్టపరంగా శిక్షించి చైర్మన్, సభ్యులను తొలగించి నూతన కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ కమిటీలను పునర్నిర్మిస్తానని అన్నారు. విద్యార్ధి నిరుద్యోగ భరోసా యాత్ర ముగింపు సభ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి నేతలు బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెళ్లి సురేష్, విజయ్, రెడ్డి శ్రీను, ఆంజనేయులు ముదిరాజ్, జోగు నరేందర్, పిట్ల నగేష్ ముదిరాజ్, శ్రీను యాదవ్, సాంబశివుడు తదితరుల పాల్గొన్నారు.