Pranit Rao: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు 14 రోజుల రిమాండ్..

by Shiva |
Pranit Rao: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు 14 రోజుల రిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అయితే, ప్రణీత్ రావును ఈ నెల 4న ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కానీ, అదే సమయంలో ఆయన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అనతరం జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి‌ హెడ్‌గా ఓ టీంను నియమించారు.

Advertisement

Next Story

Most Viewed