- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ శ్వేతపత్రానికి పోటీగా.. నేడు బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పాలనలోని ఆర్థిక ‘అరాచకం’, ‘విధ్వంసం’ వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రాలను విడుదల చేయడంతో దానికి పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’ పేరుతో వైట్‌పేపర్‌ను విడుదల చేయనున్నారు. దీన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసిన వైట్ పేపర్‌లోని గణాంకాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ ప్లానింగ్ చేసింది. తొమ్మిదిన్నరేళ్ళ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం ‘విధ్వంసం’గా పేర్కొంటున్నా అది తెలంగాణ ‘ప్రగతి ప్రస్థానం’ అని కేటీఆర్ నొక్కి చెప్పనున్నారు. తొలుత ఈ ‘స్వేదపత్రం’ను శనివారమే విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించినా అనివార్య పరిస్థితుల్లో ఒకరోజు వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించింది.
‘పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తాం.. అప్పులు కాదు.. ఆస్తులను, సంపదను సృష్టించిన తెలంగాణ.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం’ అని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలోని గణాంకాలు, కేసీఆర్ పాలనలోని పరిస్థితులన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోవడంతో ఇప్పుడు దానికి కౌంటర్‌గా గణాంకాలతో ‘స్వేదపత్రం’ను రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది.