Rajagopal Reddy : పదవి నాకు కిరీటం కాదు..బాధ్యత : రాజగోపాల్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Rajagopal Reddy : పదవి నాకు కిరీటం కాదు..బాధ్యత : రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి(Position)వచ్చినా అది నాకు కిరీటం(Crown) కాదని..ప్రజా సేవ చేసే బాధ్యత(Responsibility)గా భావిస్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ప్యామిలీ, గాంధీ జ్ణాన్ ప్రతిస్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు హాజరయ్యారు. స్టాళ్లను, 601గాంధీ ప్రతిమలను ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులతో కలిసి చరకా తిప్పారు.

ఈ సందర్భగా రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు అన్యాయం చేసే అవినీతిపరులను వదిలి పెట్టేది లేదని..అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్ము, పేదల సొమ్ము జోలికి పోవద్దని హితవు పలికారు. మంచి పనులు చేసే నాయకులు ప్రజల హృదయాల్లో ఉంటారు. గతంలో నా రాజీనామాతో ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి టార్గెట్ గా పనిచేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్మూలనతో క్రైమ్ రేట్ తగ్గిందని, ప్రభుత్వ బడుల గురించి 24 గంటలు ఆలోచిస్తున్నానని, నియోజవర్గంలో ఉన్న సమస్యల పరిష్కరించడానికి 24 గంటలు సరిపోవడం లేదన్నారు.

ఆస్తులు అంతస్తులు కాదు ఆరోగ్యమే ముఖ్యమని, ఈ ప్రాంతంలో పొల్యూషన్ ఎక్కువగా ఉందని, పొల్యూషన్ విషయంలో స్థానిక నాయకులు రాజీ పడొద్దన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన భారతీయ సాంప్రదాయ ఆట మల్కం ప్రదర్శనను అభినందించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి ఇటీవల అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకి చెందిన కొయ్యడి రవితేజ గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.



Next Story

Most Viewed