- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే కురుక్షేత్రంలో మీరు కొట్టుకుపోవడం ఖాయం: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. మధిర నియోజకవర్గంలో కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వస్తుందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సొంత ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని.. రాబోయే కురుక్షేత్రంలో మీరు కొట్టుకుపోవడం ఖాయమని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరానని.. కానీ నాకు ఇచ్చిన ఏ హామీ నేరవేర్చలేదని ఆరోపించారు. మధిర మున్సిపాలిటీలో నా వల్లే బీఆర్ఎస్ గెలిచిందని పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా పార్టీపై, బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి త్వరలోనే కారును వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read more:
లక్షల మందితో బీఆర్ఎస్‌లో చేరితే నమ్మక ద్రోహం చేశారు: Ponguleti Srinivas Reddy