రాహుల్‌‌తో పొంగులేటి, జూపల్లి భేటీ.. ఆ రోజే లాంఛనంగా కాంగ్రెస్‌లో జాయినింగ్..!

by Satheesh |   ( Updated:2023-06-26 16:37:59.0  )
రాహుల్‌‌తో పొంగులేటి, జూపల్లి భేటీ.. ఆ రోజే లాంఛనంగా కాంగ్రెస్‌లో జాయినింగ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్సీ గుర్నాధరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, అన్నే కిష్టప్ప తదితరులంతా ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

వీరందరినీ ఏఐసీసీ నేతలకు రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పరిచయం చేశారు. జూలై ఫస్ట్ వీక్‌లో వీరంతా లాంఛనంగా పార్టీలో చేరనున్నారు. వీరి అనుచరులు, అభిమానులు కూడా పదుల సంఖ్యలో ఏఐసీసీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొన్నది. గతంలో ఎన్నడూ లేనంత హడావిడి తెలంగాణ తరఫున ఏఐసీసీ ఆఫీస్‌లో నెలకొనడంతో జాతీయ నేతల్లో సైతం సరికొత్త ధీమా వ్యక్తమైంది.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరుతున్న తెలంగాణ నేతలంతా నిన్నమొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినవారే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేరికలతో రాష్ట్ర నేతల్లోనే సంతోషం వ్యక్తమైంది. పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ తదితర పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

రేవంత్‌తో జరిగిన సమావేశంలో వీరంతా వారివారి అభిప్రాయాలను, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను, కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత పార్టీ శ్రేణుల్లో పెరిగిన జోష్, రానున్న కాలంలో మరికొంత మంది చేరడానికి ఇప్పటికే జరిగిన సంప్రదింపులు, వారి నుంచి వ్యక్తమైన సానుకూల స్పందన తదితరాలన్నింటినీ రాహుల్‌గాంధీకి వివరించారు.

Read more : ఆరుగురు సిట్టింగ్లకు టికెట్ కట్..?

మూడోసారి ప్రధానిగా మోదీ కావొద్దని కోరుకుంటాం : ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

Advertisement

Next Story