- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిందీ పేపర్ లీకైన మాట వాస్తవమే.. సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటాం: వరంగల్ సీపీ
దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ హిందీ పేపర్ లీకైన విషయం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్ లీకేజీ జరిగినట్లుగా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని అన్నారు. హన్మకొండ జిల్లా కమాలాపూర్ మండలం ఉప్పల్ పరీక్షా కేంద్రం నుంచే లీకేజీ వ్యవహారం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఆ దిశగా అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇన్విజిలేటర్లే చేసి ఉంటారన్న అనుమానాలను కూడా సీపీ వ్యక్తం చేశారు. ముందుగా గతంలో టీవీ చానెల్‌లో పనిచేసిన ఓ రిపోర్టర్ నుంచి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందినట్లు సీపీ వెల్లడించారు. అతనికి సమాచారం ఏ విధంగా అందిందన్న దానిపై కూడా విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇతర జిల్లాల్లోనూ పేపర్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్ పత్రాలు బయటకు వచ్చినట్లుగా ఆధారాల్లేవని అన్నారు. అయితే ఎస్ఎస్ఎస్సీ అనే గ్రూపులో మొదటగా పరీక్ష పత్రాలు పోస్టులు కనిపించాయన్న చర్చ జరుగుతోంది.
పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలోకి..
ఇదిలా ఉండగా టెన్త్ హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌ల్లో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే హిందీ పరీక్ష ప్రశ్నా ప్రతాలు సోషల్ మీడియాలో కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. అయితే ఈ ప్రశ్నాపత్రాలు ఈ పరీక్షకు సంబంధించినవేనా..? లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. మొదటిరోజు తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే రంగారెడ్డి జిల్లా తాండూరులో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం హిందీ పేపర్ వరంగల్ జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. వరంగల్ జిల్లా కేంద్రంలోనే పరీక్షా పేపర్ లీకేజీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండోరోజూ పేపర్ లీక్ అయ్యిందన్న వార్తలు రావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొందరు ఇన్విజిలేటర్లు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చడానే పేపర్లను ఇలా వాట్సాప్ ద్వారా బయటకు పంపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
వరంగల్ సీపీకి డీఈవోల ఫిర్యాదు..
పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. నిజాలు తేల్చేందుకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు.