- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణపై ప్రధాని మోడీ చిన్నచూపు.. ఎంపీ అసదుద్దీన్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అససుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ప్రజా భవన్‌లో శనివారం నిర్వహించిన అన్ని పార్టీల ఎంపీల భేటీకి ఎంఐఎం తరుపున అసదుద్దీన్ఓవైసీ హాజయ్యారు. మీటింగ్అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలు ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు.
ప్రధానంగా ట్రిపుల్ఆర్ మంజూరు, మెట్రో విస్తరణ, లంగర్హౌజ్లోని బాపు ఘాట్డెవలప్మెంట్, మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ సర్కార్ నివేదకలు పంపించిందని, రాష్ట్రంలో ఐపీఎస్అధికారుల సంఖ్య పెంచాలని కోరిందని అససుద్దీన్చెప్పారు. పార్లమెంటు లోపల, బయట తెలంగాణ అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీ మద్దతు కాంగ్రెస్పార్టీకి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు, నిధులు, ప్రాజెక్టుల విషయంలో పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీని స్వాగతిస్తున్నామని ఎంఐఎం నేత అసుసుద్దీన్ ఓవైసీ ఈసందర్భంగా స్పష్టం చేశారు.