- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లస్సా.. మైనస్సా? పొలిటికల్ స్పీచ్‌లపై పార్టీల్లో కొత్త టెన్షన్..!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ వ్యాఖ్యలకు పదును పెట్టాయి. అధికార పార్టీలను ఇరుకున పెట్టేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కొసారి తమ పార్టీకే మైనస్ అవుతున్నాయి. ఆయా పార్టీల నేతల కామెంట్స్ ఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు సొంత పార్టీ నేతల కామెంట్స్ పదునైన విమర్శనాస్త్రాలు అవుతున్నాయి.
టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కౌంటర్ అటాక్!
ఇటీవల అమెరికాలో రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని.. 3 గంటలు ఇస్తే చాలని అనడంతో తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ఫార్మర్స్‌లో మెసేజ్ వెళ్లేలా స్కెచ్ వేసి ఇంప్లిమెంట్ చేసింది. సొంత పార్టీ నేతలు సైతం రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్న కొంత మంది కాంగ్రెస్ నాయకులు.. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని సీఎండీ ప్రభాకర్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు.
కనీస మద్దతు ధర, లక్ష రుణ మాఫీ, ఎరువులకు, విత్తనాలకు సబ్సిడీ బీఆర్ఎస్ ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో ధ్యాన్యాన్ని ప్రభుత్వం కొంటుందా అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందనే బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తుందని కౌంటర్ ఇస్తున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు చేటు చేయగా తాజా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో అని హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
హిమాన్షు వ్యాఖ్యలతో చిక్కుల్లో బీఆర్ఎస్!
మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో దుమారం రేపాయి. గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో పర్యటించి తొలి సారి పాఠశాలను సందర్శించినప్పుడు కళ్లల్లో నీళ్లు వచ్చాయనడంతో ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పాలిస్తుంది మీ ప్రభుత్వమే అని అయినా.. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని దుమ్మెతిపోశారు.
హిమాన్షు వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం సెల్ఫ్ డిఫెన్స్‌లోకి నెట్టాయి. అదే సందర్భంలో ఎన్నికలప్పుడు కేసీఆర్ చేసిన హిందుగాళ్లు, బొందుగాళ్లు కామెంట్స్‌ను కొంత మంది గుర్తు చేసుకుంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ టైంలో గులాబీ బాస్ చేసిన ఈ వ్యాఖ్యల సెగ ఏకంగా సీఎం కూతురు కవితకు తగిలింది. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా సొంత పార్టీ నేతలను కట్టడి చేసే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు. ఇటీవల రాజయ్య వర్సెస్ కడియం అంశంపై కూడా వెంటనే రియాక్ట్ అయిన కేటీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మరి రాజయ్యకు క్లాస్ పీకారు. కాగా హిమాన్షు వ్యాఖ్యలు ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతాయని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది.
ఏపీలో జనసేన చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు...
ఏపీలో వారాహియాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న జన సేన చీఫ్ తన పొలిటికల్ స్పీచ్‌ల్లో దూకుడు పెంచారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్నా.. అంతటా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చర్చ జరిగేలా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ టార్గెట్‌గా పవన్ కల్యాణ్ పొలిటికల్ స్పీచ్‌ల్లో పదును పెంచారు. అయితే ఇటీవల వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికి ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. రాష్ట్రంలో మానవ అక్రమ రావాణా సాగుతోందని అందుకు వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థే కారణమనడం పెను సంచనలం సృష్టించింది. పవన్ కల్యాణ్ మాత్రం తన కామెంట్స్‌పై తగ్గేదేలే అంటున్నారు.
తాజా అంశంపై టీడీపీ మాత్రం సైలెంట్‌గానే ఉంది. పవన్ కల్యాణ్‌కు ఈ అంశంలో ఏ పార్టీ నుంచి మద్దతు లభించలేదు. వివాదాస్పద అంశంలో సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అని రెండు ఫ్రెండ్లీ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులకు గేట్లు తెరుచుకున్న టీడీపీ, బీజేపీ జనసేన చీఫ్ వ్యాఖ్యలపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఎన్నికల వరకు తాను ఏపీ పాలిటిక్స్‌లో కీలకం కావాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా రాజకీయ వేడి రాజేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల్లో మాటలు మంటలు రేపుతున్నాయి. ప్రధాన పార్టీల తాజా వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ఎఫెక్ట్ చూపుతాయనేది తేలాల్సి ఉంది.