Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇంటర్‌పోల్‌కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు

by Shiva |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇంటర్‌పోల్‌కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు (Former OSD of Special Intelligence Branch Prabhakar Rao), ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్ రావు (Sravan Rao)ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notices) ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.

ఈ మేరకు సీబీఐ (CBI) నుంచి ఇంటర్‌పోల్‌ (Interpol)కు రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notices) అందాయి. దీంతో 196 దేశాల ప్రతినిధులను ఇంటర్‌పోల్ అప్రమత్తం చేయనుంది. కానీ, అనూహ్యంగా ప్రభాకర్‌ రావు (Prabhakar Rao), శ్రవణ్‌ రావు (Sravan Rao) అమెరికా (America)ను వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియం (Belgium)లో శ్రవణ్‌రావు, కెనడా (Canada)లో ప్రభాకర్‌రావు తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నిందితులను హైదారాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నారు.

Next Story

Most Viewed