Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా

by Shiva |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మరో భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తులుగా పని చేసిన వారి పూర్తి వివరాలు కేసులో కీలక నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. అందులో మొత్తం ఐదుగురు మహిళా జడ్జీలు పేర్లు ఉన్నట్లుగా తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఉహ) ప్రభాకర్ రావు (Prabhakar Rao) టీమ్‌పై పోలీసుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు (Phones), కంప్యూటర్లు (Computers), డీకోడ్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (Forensic Science Lab)కు పంపారు. అయితే, కేసులో A3గా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు (Bhujanga Rao) కంప్యూటర్ హార్డ్ డిస్క్‌కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ (FSL) రిపోర్ట్ అందింది. అందులో వివిధ పార్టీల పొలిటికల్ లీడర్స్ (Political Leaders), ఎమ్మెల్యే అభ్యర్థులు, 18 మంది హైకోర్ట్ జడ్జీ (High Court Judges) ల ప్రొఫైల్స్ కనిపించాయి. ఇటీవల రిటైర్ అయిన జడ్జీలతో పాటు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నుంచి ప్రమోషన్‌పై ఇతర కోర్టులకు బదిలీ అయిన న్యాయమూర్తుల పేర్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా అందులో ఉందటం అనుమానాలను రేకెత్తిస్తోంది.

కాగా, కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు (Additional SP Bhujanga Rao), మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Farmer DCP Radha Kishan Rao)లకు హైకోర్టు ధర్మాసనం గురువారం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ.లక్ష చొప్పన రెండు పూచికత్తులు, పాస్‌పోర్టు (Passport)లను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్షాధాలను కూడా చెరిపి వేసేందుక ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగ రావు (Additional SP Bhujanga Rao), మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Farmer DCP Radhakishan Rao)లకు స్పష్టం చేసింది. ఇదే కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న (Additional SP Tirupathanna)కు సుప్రీం కోర్టు కూడా షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Next Story