Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ

by Shiva |
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం.. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు‌‌లో ప్రధాన నిందుతుడు ప్రభాకర్ రావు, మరో నిందుతుడు శ్రవణ్ కుమార్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారంట్‌ జారీ చేసింది. ఈ వారంట్‌తో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికా‌లో ఉన్న ప్రభాకర్‌ రావు‌, శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసు‌ను జారీ చేయనున్నారు. ఈ అరెస్ట్ వారంట్‌కు సంబంధించి పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్-73 కింద పిటిషన్ వేసి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు‌లో ప్రధాన నిందుతుడని, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు రాధ‌కిషన్‌రావు, భుజంగ‌రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు‌ల కుట్ర వెనకాల మొత్తం ప్రభాకర్ రావు ఉన్నాడని వాడించింది.

అంతే కాకుండా ఎస్ఐబీ కార్యాలయం‌లో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని కోర్టు‌కు తెలిపింది. అరెస్ట్ సందర్భంగా నిందుతులు వెల్లడించిన విషయాలను కోర్టు‌కు పోలీసులు వివరించారు. వారు చేసిన కుట్ర వ్యక్తిగత భద్రత‌తో పాటు రాష్ట్ర భద్రతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్టు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనం అయ్యిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో కోర్టు‌లో తమ వాదనలను వినిపించారు. మరో‌వైపు ప్రభాకర్ రావు కూడా తన న్యాయవాది ద్వారా అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు‌లో ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదని స్పష్టమైంది.

Advertisement

Next Story