Harish Rao : కాంగ్రెస్ గ్యారంటీల గారడీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-23 08:57:56.0  )
Harish Rao : కాంగ్రెస్ గ్యారంటీల గారడీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో 5 గ్యారంటీ(Guarantees)ల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ లో స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టమన్నారు.

బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారన్నారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయిందని, విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలన్నారు.

Advertisement

Next Story

Most Viewed