- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Payal Shankar: ఈ సమయంలో రాజకీయాలు సరికాదు.. పాయల్ శంకర్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ (SLBC) ఘటనపై ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) అయ్యారు. ఈ మేరకు కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి దోమలపెంట (Domalapenta)కు వెళ్లనున్నారు. అక్కడ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ (SLBC Project) వద్ద కొనసాగుతోన్న సహాయక చర్యలను పరిశీలించేందుకు దోమల పెంటకు వెళ్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యహరించాలని అన్నారు. ప్రమాదానికి ముందు పనులపై సర్కార్ నిఘా కొరవడినట్లుగా స్పష్టంగా అర్థం అవుతోందిని కామెంట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర నుంచి బలగాలు రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో ముమ్మరంగా పాల్గొంటున్నాయని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. కానీ, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.