- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి
దిశ, మద్దూరు: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురువారం రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. మండల కేంద్రము లోని జామియా మసీదులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎనిమిది మంది లబ్ధిదారులకు షాది ముభారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు మద్దూరు బస్టాండులో ఆరు నెలల క్రితం బస్సు క్రింద పడి చని పోయిన మౌలానా కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ.2లక్షలు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఅర్‌యస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, స్థానిక సర్పంచ్ అరుణ వెంకట్ రాములు, తహశీల్దార్‌లు చింత రవి, రాణా ప్రతాప్ సింగ్, గిర్దావార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, ఎంపీటీసీ వెంకయ్య, హన్మిరెడ్డి, విరేష్, జగదీష్, గోపాల్, జనార్దన్, బాలరెడ్డి, శివ కుమార్‌తో పాటు మైనార్టీ నాయకులు చాన్ పాషా, హబీబ్ , మైనొద్దిన్, శంశు, షఫీ, రఫీ, మూస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.