- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీనియర్లను కాదని ఒక బ్లాక్ మెయిలర్‌కు PCC ఇచ్చారు: MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్లను కాదని ఒక బ్లాక్ మెయిలర్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించుకున్నారన్నారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చియాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో పల్లా మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్ సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ములుగు జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా తప్పుగా మాట్లాడారని, అవగాహన లేని మాటలు మానుకోవాలని హితవు పలికారు.
ములుగు జిల్లాను ఏర్పాటు చేసిందే సీఎం కేసీఆర్ అని, ములుగులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన భూమిని సేకరించడం జరిగిందన్నారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే వర్సిటీపై పార్లమెంట్‌లో మాట్లాడాలని సూచించారు. వర్సిటీ భూమి, భవనాలు వివరాలు ఇస్తామని, వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించాలని హితవు పలికారు. గాలిమాటలు మానుకోవాలని సూచించారు. అనంతరం డీజీపీకి ఎమ్మెల్సీలు టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు, దండె విఠల్ తో కలిసి వినతిపత్రం అందజేశారు.