పద్మజ హాస్పిటల్ సీజ్

by Naresh |
పద్మజ హాస్పిటల్ సీజ్
X

దిశ, నర్సాపూర్: ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిన ఇటికల ఇందిర కుటుంబానికి న్యాయం చేయాలని పద్మజ హాస్పిటల్ ముందు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకుదిగారు. మూడు రోజుల క్రితం చైతన్యపురి కాలనీకి చెందిన ఇటికల ఇందిరా గర్భసంచి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. ఆమె మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణం అంటూ కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై శివకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజెపీ పార్టీల నాయకులు ఘటన స్థలానికి చేరుకొని ఇందిర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మహిళ మృతికి కారణమైన పద్మజా హాస్పిటల్‌ను శుక్రవారం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ విజయనిర్మలతో పాటు వైద్య బృందం, రెవెన్యూ అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ.. మహిళ మృతి కేసు విచారణ కొనసాగుతుందని విచారణ పూర్తయ్యే వరకు పద్మజ ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మృతి చెందిన మహిళ పోస్టుమార్టం రిపోర్టు వచ్చేవరకు ఆసుపత్రి సీజింగ్‌లోనే ఉంటుందని తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed