- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లక్ష కోసం మంచం దిగని ఉద్యోగి.. గురి చూసి దెబ్బ కొట్టిన బాధితుడు

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలకు సేవలు చేయాల్సిన కొందరు ఉద్యోగులు డబ్బుల కోసం ప్రజలను వేధిస్తున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. లంచం ఇచ్చుకోవాల్సిందే. అడిగినంత ఇవ్వాల్సిందే. లేదంటే ఆ పని చేయరు. మరొకరితో చేయించుకోనివ్వరు. ఇది కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం జరుగుతున్న తంతు.
తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో పని కోసం ఓ వ్యక్తి అక్కడికి వెళ్లారు. బీసీ వెల్ఫేర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు కలిశారు. తన సమస్యను చెప్పుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకుని పరిష్కరించాలని కోరారు. అయితే ఆ పనిని క్లియర్ చేయాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని సదరు ఉద్యోగి శ్రీనివాస్ అడిగారు. కానీ ఆ వ్యక్తి లంచం ఇచ్చుకోలేనని చెప్పారు. దీంతో తమ పని కూడా జరగదని సదరు ఉద్యోగి తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగిని ఆ వ్యక్తి రెండు మూడు సార్లు అడిగి చూశారు. లక్ష రూపాయలు ఇస్తే గానీ పని జరగదు అని ఉద్యోగి చెప్పారు. దీంతో ఆ వ్యక్తికి ఏం చేయలో తోచలేదు. డబ్బులు లేనిది పని జరగదేమోనని ఆవేదన చెందారు. చివరకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. కానీ తన మనసు అంగీకరించలేదు. లంచం ఇవ్వకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. వెంటనే వెళ్లి ఏసీబీ అధికారులను కలిశారు. వారికి లంచం విషయాన్ని తెలిపారు.
దీంతో లంచగొండి శ్రీనివాస్‌ను పట్టుకునేందుకు ఆ వ్యక్తికి అధికారులు ప్లాన్ చెప్పారు. అధికారులు చెప్పినట్లు ఈరోజు బీసీ వెల్ఫేర్ కార్యాలయానికి వెళ్లారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు లంచం డబ్బులు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి సదరు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ తీసుకున్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ లంచం తంతు వెనుక మరికొందరు ఉన్నట్లు అనుమానించారు. శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులకు సూచించారు. కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.