- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానానాయుడు వెబ్ సిరీస్‌తో తెలుగువారి ఇజ్జత్ తీస్తున్నారు: ఇందిరా శోభన్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాల మీద సెన్సార్ ఉన్నట్టు ఓటీటీ, టెలివిజన్ కార్యక్రమాల(టీవీ షోలు) మీద కూడా సెన్సార్ బోర్డు తీసుకురావాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి ట్వీట్ చేశారు. ఓవైపు తెలంగాణ సంస్కృతులు ఉట్టిపడేలా బలగం లాంటి సినిమాలు తీస్తుంటే, #RanaNaidu లాంటి సినిమాలు తెలుగువారి పరువు తీస్తున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ పల్లె యాస, భాషా, గోస, పాట, బంధుత్వం,సంస్కృతి, యూనిటీ, చావు బతుకు ఇలా అన్ని కనుమరుగవుతున్న సందర్భంలో లాంటి సినిమాలు కళ్లకు కట్టినట్లు, గత సంస్కృతులను స్మరించుకునేటట్లు తెలంగాణ ఔన్నత్యాన్నిపెంచాయని అన్నారు. కానీ, సినీ హీరోలు, దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ వెంకటేశ్, రానా తీసిన #RanaNaidu లాంటి సినిమాలు పాశ్చాత సంస్కృతిని పెంపొందిస్తూ తెలుగువారి పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
రామానాయుడు కుటుంబం సినిమాలు అంటే ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటాయని, కానీ ఇప్పుడు డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి యువత తప్పుదారి పట్టే విధంగా తీయడం సిగ్గుచేటని విమర్శించారు. ఓవైపు, తెలుగువాడు ఆస్కార్ అందుకుంటుంటే.. #RanaNaidu లాంటి సినిమాలతో ఇజ్జత్ తీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఓటీటీ, టీవీ షోలకు కూడా సెన్సార్ ఉండాలని డిమాండ్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వీటిపై నిర్ణయం తీసుకొని ఒక సొల్యూషన్ పాస్ చేయాలని, అలాగే సెంట్రల్ సెన్సార్ బోర్డుకి కూడా పంపించి భారత సంస్కృతిని కాపాడాలని ఆమె కోరారు.
ఇవి కూడా చదవండి: Allu Arjun: చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. బన్నీ ట్వీట్ వైరల్