తత్కాల్​లో ఎస్సెస్సీ, ఓపెన్​ ఎస్సీస్సీ ఫీజు చెల్లింపులకు అవకాశం

by Sathputhe Rajesh |
తత్కాల్​లో ఎస్సెస్సీ, ఓపెన్​ ఎస్సీస్సీ ఫీజు చెల్లింపులకు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సెస్సీ, ఓపెన్​ ఎస్సీస్సీ విద్యార్థులకు తత్కాల్​లో ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సర్క్యులర్​ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉన్నట్లు ప్రకటించారు.

నేటి నుంచి ఓపెన్​ స్కూల్​లో ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణ ఓపెన్​ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. తెలంగాణ ఓపెన్ ​స్కూల్స్​ డైరెక్టర్​ సోమిరెడ్డి గురువారం సర్క్యులర్​ జారీ చేశారు. శుక్రవారం నుంచి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉంది. రూ.25 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. డీడీలు, చలాన్ల రూపంలో కాకుండా ఆన్‌లైన్ ​అప్లికేషన్లు మాత్రమే స్వీకరించనున్నారు. కాగా మే, జూన్​లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed