పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. దంపతులు స్పాట్‌డెడ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 05:47:28.0  )
పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. దంపతులు స్పాట్‌డెడ్
X

దిశ, నర్సాపూర్ : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చిలిపి చెట్ మండలం రహీంగూడ తండాకు చెందిన రవి నాయక్ నర్సాపూర్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి తన భార్య లీలతో కలిసి బైక్ పై నరసాపురం వస్తున్న క్రమంలో రెడ్డిపల్లి సమీపంలోనికి రాగానే నర్సాపూర్ వైపు వస్తున్న డీసీఎం రవి నాయక్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రవి నాయక్‌తో పాటు లీలా అక్కడికక్కడే మృతి చెందారు. నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న రవి నాయక్ కుటుంబం శివంపేట మండలం పిల్లుట్ల ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. మృతునికి ఓ కుమారుడు ఓ కూతురు ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రవి నాయక్ తన కుటుంబంతో కలిసి సెలవులకని తన స్వగ్రామమైన రహీం గూడకు పెళ్లికి వస్తుండగా ప్రమాదంలో దంపతులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Read More: బడాపహాడ్ వెళ్తుండగా డీసీఎం బోల్తా.. 35 మందికి గాయాలు

Advertisement

Next Story