స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

by Seetharam |   ( Updated:2023-07-05 06:54:58.0  )
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు టైర్ బరస్ట్ అయింది. ఈ సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆర్మూర్ లోని క్షత్రియ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులతో వస్తుండగా వేల్పూర్ మం లాక్కోర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి 63 పై జరిగిన ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన జరిగినప్పుడు పాఠశాల బస్సులో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. పాఠశాల బస్సుకు ఫిట్నెస్ ఉందా లేక తూతు మంత్రంగా తనిఖీ చేసి అనుమతులు ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను మరో బస్సులో స్కూలుకు తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read More: HYD : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం

Advertisement

Next Story

Most Viewed