ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్స్ ముట్టడి : ఆర్. కృష్ణయ్య

by M.Rajitha |   ( Updated:2024-12-05 17:33:07.0  )
ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్స్ ముట్టడి : ఆర్. కృష్ణయ్య
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్స్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల 75 వేలమంది విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. వందల కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్‌డిఓ, ఎంఆర్‌ఓ కార్యాలయాలు ముట్టడించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన బిసి విద్యార్ధుల కోర్ కమిటీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లమీద వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిదులు విడుదల చేయకపోతే విద్యార్థుల తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు.



Next Story