- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్క్రాప్‌ను వదలట్లే! వైరా మున్సిపాలిటీలో నో రూల్స్
దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, స్వచ్ఛ రిక్షాలు మాయం చేసిన ఇంటి దొంగలపై నెలలు గడుస్తున్నప్పటికీ కనీస చర్యలు కరువయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచిన స్క్రాప్ ఇనుము, రిక్షాలు మాయమైనట్లు రెండు నెలల క్రితమే వెలుగు చూసినప్పటికీ కనీసం వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ స్క్రాప్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతోనే మాయమైనప్పటికీ మున్సిపాలిటీ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితిస్తుంది. ఉన్నతాధికారులు స్క్రాప్ మాయంపై చేతులెత్తేసారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైరా మున్సిపాలిటీలో జరిగే అవినీతి అక్రమాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సోత్తును దర్జాగా వైరా మున్సిపాలిటీలో దోచుకున్నప్పటికీ ఇదంతా "మామూలే" అని అధికారులు వదిలేస్తున్నారు. వైరాలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం మున్సిపాలిటీ ఆఫీస్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తాత్కాలిక క్యాంప్ ఆఫీస్‌తో పాటు, ఆ పక్కనే ఉన్న మరో గోదామును కూల్చి వేశారు. ఈ గోదాములు సంబంధించిన స్క్రాప్ ఇనుముతో పాటు ఇతర సామాగ్రిని వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచారు. అదేవిధంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పట్టు పరిశ్రమ భవనాన్ని గతంలో కూల్చివేశారు.
ఈ భవనానికి సంబంధించిన స్క్రాప్ ఇనుము తో పాటు ఇతర సామాగ్రి కనిపించడం లేదు. సోమవారం (వైరా) గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు 20 స్వచ్ఛ రిక్షాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల రిక్షాలు వైరా మున్సిపాలిటీకి అప్పగించారు. అయితే ఈ స్వచ్ఛ రిక్షాలు మాయమయ్యాయి. టన్నుల కొద్దీ ఇనుముతో పాటు రిక్షాలు కనిపించకపోయినా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ హయాంలోనే ఈ గోల్ మాల్ జరిగిన విషయం వైరా మున్సిపాలిటీలోని ప్రజలందరికీ తెలిసిందే.
అయితే ఈ సంఘటన సంబంధించి నేటి వరకు అధికారులు పోలీసులు కూడా ఫిర్యాదు చేయలేదు. లక్షలాది రూపాయల స్క్రాప్‌ను మాయం చేసిన వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ స్క్రాప్‌ను పాత ఇనుము దుకాణంలో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్క్రాప్‌ను మాయం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వైరా మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.