Uttam Kumar Reddy: కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఉత్తమ్

by Prasad Jukanti |
Uttam Kumar Reddy: కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్ఎస్ (BRS) బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదని దుయ్యబట్టారు. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతుల సందర్భంగా ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఉత్తమ్.. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం తొలిగించే అవకాశం బీఆర్ఎస్ కు రాదన్నారు. ఈ రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమే ఉండబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, కౌన్సిల్ ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటివని నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక పద్దతి ప్రకారం ప్రవర్తించాలన్నారు. రానురాను ఈ వ్యవస్థల పట్ల గౌరవం తగ్గుతున్నదని సభ్యులు హాజరు, సభలు సాగుతున్న రోజులు తగ్గుతున్నాయని ఇది మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంత స్థాయిలో మిగిలింది మన దేశంలోనేనని దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed