- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాస్త్రవేత్తలు తీసుకెళ్లిన శాంపిల్స్ సంగతి ఏంటి సార్..
దిశ, గాంధారి : అదో పెద్ద ప్రముఖ కంపెనీ అని వారి పై చర్యలు తీసుకోవడానికి బహుశా అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారు కాబోలు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మాల్ గ్రామంలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంట చేతుకొచ్చిన వేళ గడ్డి మందు కొడితే పంట మొత్తం కాండం నుంచి కిందికి పడిపోయి చచ్చుపడిపోయింది. ఈ సంఘటన ఇది వరకు జరిగిందే. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు మొక్కజొన్న పంట శాంపిల్లను తీసుకొని లోపం ఎక్కడ జరిగిందో పూర్తివివరాలు రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు.
రెండు రోజులు కాస్త నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీని పై మండల వ్యవసాయ అధికారి నరేష్ ను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తి సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఇప్పటికే నష్టపోయిన పంటల గురించి పెద్ద కంపెనీ అని శాంపిల్స్ తీసుకెళ్లిన శాస్త్రవేత్తలు తమకు న్యాయం చేస్తారని ధీమాతో రైతులు ఉన్నా.. మండల వ్యవసాయ అధికారి మాత్రం తమ పై స్థాయి అధికారుల ఫోన్ నెంబర్ రైతులకు ఇచ్చి ఏమైనా ఉంటే వారిని అడగండి అని చెప్పడం కొసమెరుపు.