విద్యార్థుల భోజనం నాణ్యతను పర్యవేక్షణ చేయాలి.. కలెక్టర్

by Sumithra |
విద్యార్థుల భోజనం నాణ్యతను పర్యవేక్షణ చేయాలి.. కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇంచార్జిలు పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రత పై ఓరియంటేషన్ కమ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న వార్తల పై జిల్లాలోని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతి గృహల్లోని విద్యార్థులకు రుచికరమైన, నాణ్యత గల భోజనం అందించాలని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తాగునీరు కలుషితం, వస్తువులు, పదార్థాలు గడువు తేదీ ముగిసినవి వాడకుండా చూడాలని తెలిపారు. బియ్యంలో పురుగులు ఉండకుండా, వంటలు వన్డే ముందు పరిశీలించాలని తెలిపారు.

పురుగులు పట్టిన బియ్యంను పౌర సరఫరాల సంస్థకు తిరిగి పంపించాలని సూచించారు. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవాలని, సరుకులు, బియ్యం సంచులను బెంచీల పై ఏర్పాటు చేయాలని తెలిపారు. వంటలు వండే ముందు సరుకులను మంచిగా కడగాలని తెలిపారు. జిల్లాలో ప్రతీ ఇన్స్టిట్యూట్ కు ఆయా ప్రిన్సిపాల్ లతో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీ ప్రతీ రోజు విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించాలని, విద్యార్థులతో భోజనాలు చేయాలని తెలిపారు. మండల మానిటరింగ్ అధికారులు ఆయా మండలంలోని స్కూల్స్, హాస్టల్ లను మానిటరింగ్ చేయాలని అన్నారు. ఫుడ్ ఇంచార్జీలకు, వంటలు వండే వారికి అవసరమైన శిక్షణ, సూచనలు అందించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు వచ్చినపుడు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కు తెలియజేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతీ పాఠశాలలో/ఇన్స్టిట్యూట్ లలో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు.

మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆయా ఇన్స్టిట్యూట్ లను విజిట్ చేసి విద్యార్థులతో పాటు భోజనాలు చేయాలని తెలిపారు. అంతకుముందు ఫుడ్ ఇన్స్పెక్టర్ శిరీష పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వేడి భోజనం విద్యార్థులకు అందించాలని, చేతులు శుభ్రంగా కడగాలని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ టీమ్ పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తరచూ విద్యార్థులకు మెడికల్ చెక్ అప్ నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన సరుకులను వాడకుండా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో /జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా విద్య శాఖాధికారి రాజు, మండల విద్యాధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed