- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సులు లేక విద్యార్థుల అగచాట్లు.. పలుచోట్ల వేళకు రాక.. వచ్చినా ఆపక..
దిశ,తాడ్వాయి : బస్సుల కొరత, సమయానికి సరిపడా బస్సులు రాక ఉదయం వచ్చే ఆ కొద్దిపాటి బస్సులు సైతం రద్దిగా ఉండడంతో అర్గో0డ గ్రామానికి చెందిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లాకు వెళ్లి చదువుకోవాలంటే ఇక్కట్లు తప్పడం లేదు.దీంతో మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ...ఇంటర్,డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు తప్ప మరో మార్గం లేదు.సొంత వాహనాలు లేక,అధిక చార్జీలు చెల్లించి కాలేజీలకు వెళ్లలేక కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. పాసులున్న బస్సులు లేకపోవడం, పాసులకు పరిమితులు విధించడంతో ఆందోళన చెందుతున్నారు.దీనికి తోడు విద్యార్థులు, మహిళలు ఉన్న స్టేజీల వద్ద డ్రైవర్లు బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో కాలేజీ విద్యార్థులు అనేక పాట్లు పడుతున్నామని అంటున్నారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు.వచ్చిన అర కొర బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో ఊపిరాడకుండా ప్రయాణం చేస్తున్నామని వారు వాపోతున్నారు. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం ఉండటం లేదని అంటున్నారు.బస్సులో 100కు పైగా విద్యార్థులు ఉంటున్నారని, ప్రమాదమని తెలిసినా ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తున్ననదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో కళాశాలలకు ఆలస్యంగా వెళ్తున్నామని చెప్తున్నారు.ఉదయం కాలేజీకి వెళ్లాలన్న సాయంత్రం ఇంటికి రావాలన్న ఆలస్యమవుతుందని అంటున్నారు. బస్సుల కోసం పడిగాపులు కాస్తూ వాటి వెనుక పరుగులు తీస్తున్నామని వాపోతున్నారు.ఆర్టీసీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన గాని సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.