- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ : కల్వకుంట్ల కవిత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని ఏప్రిల్ 1 వ తేదీ నుండి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారన్నారు. సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో ఉన్నారు.