ఆర్మూర్ లో మున్సిపల్ ఆదాయానికి గండి...

by Sumithra |
ఆర్మూర్ లో మున్సిపల్ ఆదాయానికి గండి...
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ పరిపాలన అధికారుల లోపాయికారి సహకారాలతో పూర్తిగా గాడి తప్పినట్లు తయారైంది. మున్సిపల్ కార్యాలయానికి రావలసిన బకాయిల వసూళ్ల పై మున్సిపల్ పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యధోరణి కనబరుస్తున్నారని ఆర్మూర్ మున్సిపల్ జనం కోడై కూస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ తైబజార్ వేలం పాటలో పాల్గొని పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకుండ కాంట్రాక్టర్ తైబజార్ పన్నులను ప్రజలు, రైతులు, వ్యాపారస్తుల నుంచి ప్రతినిత్యం దర్జాగా వసూలు చేస్తున్నాడు. కానీ తై బజార్ వేలంపాటలో తైబజార్ ను దక్కించుకున్న సదర్ కాంట్రాక్టర్ మున్సిపల్ కు చెల్లించవలసిన డబ్బులు రెండు నెలలు కావస్తున్న చెల్లించడం లేదు.

మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్న సదరు కాంట్రాక్టర్ ను పట్టించుకునే నాథుడు ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గంలో అధికార ఘనంలో కనబడడం లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది మార్చి 28 వ తేదీన తైబజార్ కు వేలం పాటను నిర్వహించారు. ఇందులో రోజు వారితో పాటు, ప్రతి బుధవారం జరిగే అంగడి (సంత)ను కలిపి తైబజార్ వేలం వేస్తామని అధికారులు ప్రకటించి వేలం నిర్వహించారు. మున్సిపల్ వారి వేలంపాట రూ. 25 లక్షల 30 వేలుగా నిర్ణయించారు. ఈ వేలం పాటలో 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎస్ఆర్.సుజాత భర్త ఎస్ఆర్ రమేష్ పాల్గొన్నాడు. మున్సిపల్ తైబజార్ వేలం పాటలో పాల్గొనడానికి రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారు. వేలం పాటలో పాడిన రూ. 25 లక్షల 30 వేలను కాంట్రాక్టర్ రమేష్ నాలుగు కిస్తిలుగా ఆర్మూర్ మున్సిపల్ కు డబ్బులు చెల్లించాలి.

మొదటికిస్తుగా రూ.6 లక్షల 32 వేలు చెల్లించాలి. అయితే కాంట్రాక్టర్ రమేష్ డిపాజిట్ డబ్బులు రూ.5 లక్షలు పోగా రూ.లక్ష 32 వేలు మార్చి నెలలోనే చెల్లించాలి. మొదటికిస్తూ డబ్బులు రూ.1,32,000 చెల్లించక పోవడంతో మున్సిపల్ అధికారులు ఏప్రిల్ 21న తైబజార్ డబ్బులను చెల్లించాలని కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశారు. మొదటి కిస్తుకింద చెల్లించాల్సిన తైబజార్ వేలం డబ్బులు రెండు నెలలు కావస్తున్న కాంట్రాక్టర్ మున్సిపల్ కు చెల్లించుకున్న మున్సిపల్ కమిషనర్, అధికారులు, పాలకవర్గం లోపయకారిగా సహకరిస్తున్నారనే విమర్శలు ఆర్మూర్లో జోరుగా వినబడుతున్నాయి. నెల రోజుల కిందట కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేసిన ఆ కాంట్రాక్టర్ నోటీసును బేఖాతరు చేస్తూ ఇప్పటివరకు మున్సిపల్ తైబజార్ మొదటి గిఫ్ట్ డబ్బులను ఇంతవరకు చెల్లించలేదు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు చొరవ తీసుకొని కాంట్రాక్టర్ చెల్లించాల్సిన డబ్బులను వసూలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు కోర్టు ఆదేశాలతో మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తై బజార్ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వివిధ పనులు చేసుకుంటున్న తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ లారీ యాజమాన్య ప్రతినిధులను ఆర్మూర్ తై బజార్ కాంట్రాక్టర్ మనుషులు ప్రతినిత్యం వేధిస్తూ తైబజార్ వసూలు చేస్తున్నారని లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై సదరు లారీ యజమానులు ఆర్మూర్ పోలీస్ అధికారుల, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ మనుషుల వేధింపులు వసూళ్లు గురించి వివరించారు. మున్సిపల్ ఉన్నత అధికారుల, కోర్ట్ ఆదేశాల ప్రతులను సైతం ఆర్మూర్ పోలీసులకు చూపించారు. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో లారీ అసోసియేషన్ సభ్యులకు తైబజార్ కాంట్రాక్టర్ మనుషుల వేధింపులు, నగదు వసూళ్లు లేకుండా చూడాలని లారీ యజమానులు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశాం.. హుయుం, మున్సిపల్ మేనేజర్..

ఆర్మూర్ పట్టణంలో తైబజార్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎస్ఆర్. రమేష్ మొదటి కిస్తుకు చెందిన రూ. లక్ష 32 వేలు 2 నెలలు కావస్తున్న చెల్లించకపోవడంతో నోటీసు జారీ చేశాం. అయినా బకాయి డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed