- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలంకు శనివారం బస్సు ప్రారంభమైంది. ఆర్టీసీ మెయింటెనెన్స్ విభాగం డిప్యూటీ ఆర్ఎం శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై అరుణాచలం బస్సును ప్రారంభించారు. ఆర్మూర్ నుంచి అరుణచలంకు వెళ్లే బస్సులు కాణిపాకం, వెళ్లూరు గోల్డెన్ టెంపుల్, అలంపూర్ జోగులాంబ మీదుగా తిరిగి ఆర్మూర్ కు వస్తుందన్నారు. ఈ టూర్ కు ప్రతి ఒక్కరికి చార్జీలు ఇలా ఉన్నాయని వివరించారు. పెద్దలకు 4200/- రూపాయలు, పిల్లలకు 3400/-రూపాయలు ఉన్నాయని తెలిపారు. మళ్ళీ డిసెంబర్ 13 న పౌర్ణమికి ఆర్మూర్ నుంచి అరుణాచలంకు ఆర్టీసీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పి. రవికుమార్, ఎస్ టి ఐ పారు, ఎం ఎఫ్ గంగా కిషన్, ఏ డీసీలు చక్రవర్తి, ఎన్ వి రెడ్డి, యూత్ అశోక్, కోడిచెర్ల నరసయ్య, బుకింగ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.