- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం భాన్సువాడ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, కోటగిరి : పది వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తెచ్చుకొని రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ గా బాన్సువాడ నియోజకవర్గం ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో పలుఅభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం దేవుడిగుట్టతాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొటగిరి మండలంలో నూతనంగా నిర్మించుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబందించిన సుమారు ఏడు కోట్ల రూపాయల చెక్కులను పంపిణి చేశారని తెలిపారు. దీపావళి తరువాత మళ్ళీ 14 కోట్ల రూపాయలు బిల్లులను చెల్లిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే పది వేల ఇండ్లు మంజూరు చేసుకొని నిర్మించుకుంటున్న ఘనత తమకే దక్కుతుందని ఆయన అన్నారు. 13 డిసెంబర్ 2005 వరకు ఎవరైతే గిరిజనులు, అటవీ శాఖ భూములను కబ్జా చేసుకుని ఉన్నారో వారికి పట్టాలను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రైతులు ఎవ్వరు కూడా తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, రేపటి నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, ఎంపీపీ గంగాధర్ పటేల్, స్థానిక సర్పంచ్ శాంతిబాయి, ఆర్డీఓ రాజేశ్వర్, బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, డి ఈ నాగేశ్వర్ రావు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.