- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడితో కలిసి భార్యేభర్తని హత్య చేసింది ?
దిశ, భిక్కనూరు : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న ఉద్దేశంతో ఫుల్లుగా మద్యం తాగించి మత్తులోకి వెళ్ళాక ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం విషం కలిపిన కల్లుతాగించి అడ్డు తొలగించుకున్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బందెల బాబు (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య లావణ్య తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఎల్లారెడ్డికి చెందిన బాబువద్దకు తీసుకెళ్తే ఆరోగ్యం బాగుపడుతుందని తెలిసినవారు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇరుకుటుంబాల మధ్య రాకపోకలు పెరిగిపోవడం, ఫ్యామిలీ ఫ్రెండ్ గా స్వామి ఆ ఇంట్లో స్థానం సంపాదించుకున్నాడు. లావణ్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని గ్రహించి, భార్య లావణ్యను స్వామికి దూరంగా ఉంచేవాడు.
అప్పటినుంచి తనను విడిచి వెళ్లకుండా భార్యను ఒంటరిగా వదిలి ఉండేవాడు కాదు. దీనికి తోడు కూతురు నిఖిత ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో కొద్దిరోజుల క్రితం నిఖితను స్వామి వద్దే ఎల్లారెడ్డిలో ఉంచారు. అయితే నిన్న మధ్యాహ్నం నిఖితను వెంటబెట్టుకొని వచ్చాడు. స్వామి బాబుకు పీకల్లోతు మద్యం తాగించాడు. దీంతో బాబు మత్తులోకి జారుకున్నాడు. స్వామి వేకువ జామున నిద్రలేచి తిరిగి ఎల్లారెడ్డి వెళ్ళిపోయాడు. భార్య లావణ్య ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రాంతంలో నిద్ర మేల్కొని, నీ కొడుకు ఎంత లేపినా లేవడం లేదని అత్త వద్దకు వచ్చి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు స్వామివద్దకు వచ్చి లేపే ప్రయత్నం చేయగా ఉలుకుపలుకు లేకపోవడం పైగా, స్వామి నోటి నుండి బురుగులు రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే భిక్కనూరు ఎస్సై ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులు ముమ్మాటికి స్వామిది మర్డరే నని, కల్లు లేదా మందులో విషం కలిపి తాగించి హత్య చేశారని కుటుంబ సభ్యులు గట్టిగా అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే బాబు హత్యకు కారణమని, హత్యకు కారకులైన మృతుని భార్య లావణ్య, స్వామిలను కఠినంగా శిక్షించాలని సాయంత్రం స్టేషన్ కు వచ్చి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసునమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు, అనుమానిస్తున్నట్టుగా పోస్టుమార్టం నివేదిక వస్తే మర్డర్ కింద కేసును మార్చుతామని వివరించారు.