మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు: రేవంత్ రెడ్డి

by S Gopi |
మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు: రేవంత్ రెడ్డి
X

దిశ, నిజమాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాంసాగర్ గుర్తొస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ..నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నరు.. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని, నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందేనని గుర్తుచేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ అని, ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా అని అన్నారు.

అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగిందని, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదన్నారు. తన చెంచాలతో తనని తిట్టిస్తున్నాడని, పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండని ఎద్దేవా చేశారు. మోడీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదని, ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉందని, ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని అన్నారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని హాథ్ సే హాథ్ జోడో యాత్ర చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు.

కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని ప్రజలను విన్నవించారు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోడీ తెలంగాణను అవమానించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఉచితంగా అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పేదలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ దేనని హామీ ఇచ్చారు. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండిని ప్రజలను వేడుకున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కేశవేణు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed