- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
దిశ, ఆర్మూర్ : సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు రివర్స్ పంపింగ్ తో నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ సాగునీటి దినోత్సవ సంబరాలను ఆర్మూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సకల జనులకు సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి కంట్లో సంతోషం ప్రతి ఇంట్లో ఆనందం సీఎం కేసీఆర్ నింపుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన ఉద్యమ నేత కేసీఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొ్న్నారు. తెలంగాణలోని కోటి ఎకరాలను మగాని చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం సాగునీటి సంక్షేమ ప్రాజెక్టులతో మన రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల సాగునీరు సాధ్యమైంన్నారు. తమ స్వగ్రామం వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెరువు లేదన్నారు. పూర్వం గ్రామానికి చెరువుంటేనే ఊరు బాగుండేదని దాంతోనే మా గ్రామానికి ఆడపిల్లలను ఇచ్చేవారు కాదన్నారు.
చెరువుల బాగు కోసమే రాష్ట్ర వ్యాప్తంగా రివర్స్ పంపింగ్ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను నిండుకుండల్లా తయారు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీకి గతంలో మాదిరిగానే వందకు పైచిలుకు స్థానాల్లో డిపాజిట్లు దక్కవన్నారు. రెండు, మూడు స్థానాలకు వారు పరిమితం కావడం ఖాయమన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ రివర్స్ పంపింగ్ పనుల కోసం రూ.1,100 కోట్లను, ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో, ఆర్మూర్, నందిపేట్, ఆర్మూర్ మున్సిపల్ లలో లిఫ్ట్ పనుల కోసం, ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కోట్ల నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివరించారు.
మిషన్ భగీరథతో మన తలాపున పారే గోదావరి నీళ్లను ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సీఎం కేసీఆర్ తెచ్చి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీలు పస్క నరసయ్య, మాస్త ప్రభాకర్, వాకిడి సంతోష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, ఇరిగేషన్ ఎస్ఈ యశస్విని, ఈఈ భాను ప్రకాష్, డీ.ఈ కృష్ణమూర్తి, శ్రీకాంత్, ఏఈలు పవన్, సునీల్ సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.