అనుమతులు ఒకచోట.. చెట్ల నరికివేత మరొక చోట

by Aamani |
అనుమతులు ఒకచోట.. చెట్ల నరికివేత మరొక చోట
X

దిశ, పిట్లం : మండలాలను అభివృద్ధి చేసే దిశగా గత ప్రభుత్వం మండల స్థాయిలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసింది. ఎన్నికలు రావడంతో ఆ పనులు ఎన్నికల నియమావళి ప్రకారం నిలిపివేసింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసి పనులను గుత్తేదారులకు అప్పగించారు. పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా గల చెట్లను తొలగించేందుకు ఆర్ అండ్ బి అధికారులు గ్రామపంచాయతీలో నోటీసులు అంటించి టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లు దక్కించుకున్న గుత్తే దారులు 1.4 కిలోమీటర్ల రోడ్డు సాయిబాబా మందిరం నుండి పాత హైవే లో గల శిశు మందిర్ స్కూల్ వరకు ఇరువైపులా గల 21 చెట్లను నరికి వేయడానికి రూ.26 వేల 500 లనుఆర్ అండ్ బి అధికారులకు, పదివేల రూపాయలు ఫారెస్ట్ అధికారులకు చెల్లించి సదరు గుత్తేదారు కాంట్రాక్టు పనులు ప్రారంభించారు.

ఈ చెట్ల నరికివేత కార్యక్రమం అధికారుల పర్యవేక్షణలో జరగాలి అలా కాకుండా ఎవరు లేకుండానే యదేచ్చగా చెట్లును నరికి వేశారు. అనుమతులు ఉన్న దగ్గర కాకుండా పిట్లం స్మశాన వాటిక దగ్గర గల చెట్లను నరికి తమకు అనుకూలంగా ఉన్న సైజులను తీసుకొని లారీ లోడ్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు.వీటిని పర్యవేక్షించాల్సిన అధికారుల నిఘా లోపం కారణంగానే సదరు కాంట్రాక్టర్ ఇస్టా రీతిగా చెట్లను నరుకుతున్నాడని పలువురు అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed