Nizamabad Collector : రక్షా బంధన్ శుభాకాంక్షలు

by Aamani |
Nizamabad Collector : రక్షా బంధన్ శుభాకాంక్షలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సోదర భావానికి ప్రతీకగా ప్రతియేటా జరుపుకునే రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కలెక్టర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని గుర్తు చేశారు.

అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర బాధ్యత అని రక్షాబంధన్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటుతుందన్నారు. రాఖీ పౌర్ణమి వేడుక ప్రజల మధ్య ఆత్మీయతను మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed