- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి అధికారం మనదే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశానికి మోడల్ తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణకి మోడల్ నిజామాబాద్ అర్బన్ అని, మరోసారి అధికారం మనదే-కార్యకర్తలు కార్యదీక్షులయి ఇంటింటికి తిరిగి ప్రజలకి అభివృద్ధి-సంక్షేమ పథకాలని వివరించాలని ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో దుబ్బ మున్నూరుకాపు సంఘంలో 16, 17, 37, 38, 39, 40వ డివిజన్ ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గౌ.రాజ్య సభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతు పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష...పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపడుకుంటాం అన్నారు.
సీఎం కేసీఆర్, పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని మరింత బలోపేతం చేసి మరింత చైతన్య పరిచేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారని అన్నారు. వారి ఆదేశాలతో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతు శాంతి భద్రతలకు కేరాఫ్ అడ్రస్ నిజామాబాద్, నిజమాబాద్ సురక్షిత నగరం కావడం వల్ల అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతూ స్థానిక యువతకి ఉపాధి కల్పిస్తున్నాయి అన్నారు. అభివృద్ధిలో నిజామాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్ప రాజు, యెనుగందుల మురళి లతో పాటు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.