ఎంపీగా ఎన్నికైన ఐదు నెలల్లోనే దానికి కేంద్రాన్ని ఒప్పించాను : ఎంపీ అర్వింద్

by Vinod kumar |
ఎంపీగా ఎన్నికైన ఐదు నెలల్లోనే దానికి కేంద్రాన్ని ఒప్పించాను : ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులకు మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి నువు ఏంచేసావో చెప్పు, నేను ఎంపీగా ఎన్నికైన 5 నెలల్లోనే పసుపు సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించి స్పైస్ బోర్డు ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, రూ.30 కోట్ల రూపాయల నిధులు తెచ్చాను అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా వెల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతుల కోసం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాముణ్ణి, హనుమంతున్నీ విడదీసిన హీనులు టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు అని బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అని ఎద్దేవా చేశారు.

తాను ఎంపీగా ఎన్నికయ్యాక పసుపుకు గతం కంటే అధిక మద్దతు ధర ఇచ్చామని, నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేసిందన్నారు. తాను ఎంపీగా అయ్యాక పసుపుకు అధిక ధర, అధిక బాయిలర్లు, టార్పాలిన్లు ఇచ్చామని పసుపు దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాం అన్నారు. నిజామాబాద్ నుండి పసుపుని విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు.


ఇథనాల్ ఇండస్ట్రీకి అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాసి, ప్రజలను మాత్రం మభ్యపెట్టారని 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల రాష్ట్రం వడ్లు కేంద్రం కొనుగోలు చేసిందన్నారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రం నయా పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవే.. ఇందులో రాష్ట్ర వాటా శూన్యమన్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి పని అయిపోయినట్లు అనిపిస్తుంది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు

రైతు ధర్నాలో పాల్గొనవద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పినా రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరు కావడం చూస్తే మంత్రి ప్రశాంత్ పని అయిపోనట్లే అనిపిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు అన్నారు. ప్రశాంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని కేసీఆర్‌కి నిజంగా మనసులో ఉంటే తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాకు వస్తున్న నన్ను అడ్డుకునే యత్నం చేశారు.. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు.


2014 లో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని, చెరుకు, పసుపు పరిశోధన కేంద్రం తెరిపిస్తాని చెప్పి మాట తప్పారు అని గుర్తు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారని, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇల్లు నిర్మించిన ఘనత ప్రధాని మోడీదని ఆర్టీఐ ద్వారా రాష్ట్రంలోని డబుల్ బెడ్ రూంల ఇళ్ల వివరాలు తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఏమైందని ప్రశ్నించిన రఘునందన్ రావు.. స్పైస్ బోర్డుకు, పసుపు బోర్డుకు తేడా ఏంటో తెలియని మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తాళ్ళ రాంపూర్ సొసైటీలో అక్రమాలు మంత్రి ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు.

Next Story

Most Viewed