Mohammed Ali Shabbir : తీజ్ ఉత్సవం గిరిజన సంస్కృతికి ప్రతీక

by Aamani |
Mohammed Ali Shabbir : తీజ్ ఉత్సవం గిరిజన సంస్కృతికి ప్రతీక
X

దిశ,కామారెడ్డి : తీజ్ ఉత్సవాలు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు, పర్యావరణ హిత జీవనానికి ప్రతీక గా నిలుస్తాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగిన తీజ్ ఉత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శ్రావణ మాసంలో 9 రోజుల పాటు గిరిజన యువతులు తమ సంప్రదాయక పద్ధతుల్లో కుటుంబాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు.

చివరి రోజున గోధుమ గడ్డి మొలకలు అందుకు ప్రతీకగా భావించి ఉత్సవాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భిన్నత్వాలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి వారి పద్ధతుల్లో సర్వ మానవాళి శ్రేయస్సు, పర్యావరణ హితం కోసం ఉత్సవాలు జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed