బోధన్ లోని అన్నపూర్ణ సూపర్ మార్కెట్ లో భారీ చోరీ

by Kalyani |
బోధన్ లోని అన్నపూర్ణ సూపర్ మార్కెట్ లో భారీ చోరీ
X

దిశ, బోధన్ : బోధన్ పట్టణం ఆచన్ పల్లి ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ సూపర్ మార్కెట్లో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సూపర్ మార్కెట్ ను లూటీ చేశారు. సూపర్ మార్కెట్ రేకులు తొలగించి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 15 లక్షల వరకు దొంగతనం జరిగినట్లు యజమాని సుధీర్ వెల్లడించారు. బోధన్ ఎసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వీరయ్య ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed