- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector: మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలి
దిశ, కామారెడ్డి : గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని వసతిగృహాలను మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి వసతి గృహాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు.
పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందే విధంగా చూడాలని తెలిపారు. ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అ