- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి రైతూ సొసైటీ అభివృద్ధికి పాటుపడాలి..
దిశ, కమ్మర్ పల్లి : సొసైటీలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు సహకరించాలని సోసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి రైతులను కోరారు. బుధవారం కొనసముందర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో సొసైటీ లావాదేవీలను రైతులకు చదివి వినిపించారు. రైతుల కోరిక మేరకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని కోరుతూ తీర్మానించారు. అలాగే సొసైటీకి నూతన కో-ఆప్షన్ మెంబర్ గా బలేరావ్ నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం పలువురు నర్సయ్యకు పుష్పగుచ్ఛం ఇస్తూ అభినందించారు. కోఆప్షన్ కు సహకరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు బాపురెడ్డి , పాలక వర్గ సభ్యులకు నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, డైరెక్టర్లు బండి నారాయణ, బెజ్జరాపు ముత్త, నల్ల గంగాధర్, ఉపసర్పంచ్ పెరం లింబాద్రి, ఏఎంసీ డైరెక్టర్ సూర శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జనార్ధన్, సామ ప్రతాప్ రెడ్డి, భూమారెడ్డి, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.