- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jukkal MLA : బీఆర్ఎస్ నాయకుల మాటలు రైతులు నమ్మొద్దు..
దిశ,నిజాంసాగర్: అర్హతలున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన శుక్రవారం మహమ్మద్ నగర్ మండలం లో నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అర్హతలున్న ప్రతి ఒక్క రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక సంక్షేమ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో రైతు భరోసా రూ. 15 వేలు అందిస్తామని అన్నారు. గత 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకనే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ధర్నాలో కూర్చున్న మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియట్లేదు అని ఎద్దేవా చేశారు. కల్లు తాగి టెంటు కింద కూర్చుని రైతుల రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నాడని అన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్య పడకుండా ఉండాలని కోరారు. కష్ట పడ్డ ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటిసి చికోటి జయ ప్రదీప్,యూత్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్,అనీస్ పటేల్, ప్రజా పండరి,చికోటి మనోజ్,నాగభూషణం,తోట రాజు,లోక్యా నాయక్,సవాయి సింగ్,అబ్దుల్ ఖా లేఖ్, గోపి నాయక్,డీఈ గంగాధర్, ఏఈ లక్ష్మణ్, ఏడీఈ బాలాజీ, కనెక్షన్ ఏఈ రమణారెడ్డి, ఏ ఈ సివిల్ లింగయ్య, తహసీల్దార్ సవాయి సింగ్,ఎంపీడీఓ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.