జహీరాబాద్‌లో కాంగ్రెస్ గెలిచినా.. కామారెడ్డిలో బీజేపీ హవా

by Mahesh |
జహీరాబాద్‌లో కాంగ్రెస్ గెలిచినా.. కామారెడ్డిలో బీజేపీ హవా
X

దిశ, కామారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఊహించని విధంగా ఓటర్లు తీర్పునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి 66700 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఈ ఆరు నెలల కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు 85 వేలకు పెరిగింది. అంటే 18 వేలకు పైగా ఓటు బ్యాంకు పెరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయగా ఆయనకు 55 వేల ఓట్లు పోలవగా ప్రస్తుతం సురేష్ షెట్కార్ కు 63 వేల ఓట్లు పోలయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 13 వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి పెరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా చూస్తే జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ భారీ మెజార్టీతో గెలుపొందగా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ షెట్కార్ చేతిలో ఓటమి పొందారు. కాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు ఇక్కడ గట్టి పోటీని ఇవ్వలేకపోయారు. ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరు కూడా కామారెడ్డి ఓటర్ల నాడీని పసిగట్ట లేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపొందినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కామారెడ్డి ఓటర్లు ఆయనను అంతంత మాత్రంగానే ఆదరించారు.

సురేష్ షెట్కర్ చేతిలో ఓటమినీ చవి చూసిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు కామారెడ్డి ప్రజలు మద్దతు పలికారు. గెలుపొందిన సురేష్ షెట్కార్ కు ఇక్కడ 66343 ఓట్లు రాగా ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు 85178 ఓట్లు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు కేవలం 23255 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో గెలుపొందిన షెట్కార్ కంటే ఓటమి చవిచూసిన బీబీ పాటిల్ 18835 ఓట్లు అధికంగా సాధించారు. కామారెడ్డి జిల్లాలో బీబీ పాటిల్ కు మంచి లీడ్ వచ్చినప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు తక్కువగా రావడంతో ఓటమి చెందారు.

Advertisement

Next Story

Most Viewed