- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే.. నిరుద్యోగుల కోసం కొట్లాడుతా - ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రులున్నారని, వారి కోసం కొట్లాడే గళమవుతానని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో లక్షలాదిమంది పట్టభద్రులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 1.97 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా తమ పేరును నమోదు చేయించుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో 1.07 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నరేందర్ రెడ్డి తెలిపారు.
అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, మెజారిటీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న చైతన్యం ఇంకా పట్టబద్రుల్లో రావడం లేదని, ఓటర్ లిస్టులో తమ పేరును కూడా నమోదు చేయించుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్టభద్రుల తరఫున కొట్లాడే గళానికి బలం పెంచే విధంగా ఈసారైనా 100% పట్టభద్రులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలని మీడియా ద్వారా పట్టభద్రులకు నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోవద్దని ఆయన అన్నారు. 2021 నాటికి లేదా అంతకు ముందు పట్టభద్రులై ఉన్నవారు ఈ నెల 30 నుండి నవంబర్ 6 వరకు పట్టభద్రులు ఓటరుగా ఎన్రోల్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో తమ ప్రతినిధులు కేంద్రాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటారని, ఓటర్ గా ఎన్రోల్ చేసుకోవాలనుకునే వారు అప్లికేషన్ తో పాటు వారి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తమ ప్రతినిధులకు అందజేస్తే వారే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తారని నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ అవకాశాన్ని పట్టభద్రులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని, అప్పటిలోపు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎన్రోల్ చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతగా ఎంతో మంది విద్యార్థులకు విద్యా దానం చేసిన తాను, పేద విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సంపాదించిన సంపాదనలో ఎక్కువ మొత్తం ఖర్చు చేశానని అన్నారు. ఇకముందు కూడా చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు.
నేటి సమాజంలో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ వంటి ఉన్నత విద్య చదివిన ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిస్తే తన పూర్తి ఫోకస్ పట్టభద్రుల ఉద్యోగ అవకాశాల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం పనిచేస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిచినా ప్రభుత్వం నుంచి నయా పైసా జీతం తీసుకోకుండానే పనిచేస్తానని, భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్న తాను ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తానని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాటిచ్చారు.
లక్షలాది మంది నిరుద్యోగుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్స్ గా పనిచేస్తున్నారన్నారు. వారికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వారి తరఫున కూడా తాను శాసనమండలిలో గళం విప్పి కొట్లాడుతానన్నారు. వారికి హెల్త్ కార్డులు ఇప్పించడానికి కృషి చేస్తానని నరేందర్ రెడ్డి అన్నారు.
2018లో తాను కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదని ఆయన అన్నారు. ఏ రాజకీయ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబుగా నరేందర్ రెడ్డి ఈ మాట చెప్పారు. ఇప్పుడు కూడా పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నానన్నారు. ఒకవేళ టికెట్ వస్తే అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీలో మాత్రం ఉంటానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోసారి ఏర్పాటు చేసే ముఖాముఖిలో ఈ విషయం పై స్పష్టతనిస్తానని ఆయన అన్నారు.